వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్మనీలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్, ఓటింగ్‌కు దూరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

chennamaneni ramesh
హైదరాబాద్: తెలుగుదేశం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఓ శాసనసభ్యుడు గైర్హాజరు కానున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీలో ఉండటంతో ఓటింగ్‌కు రాలేక పోతున్నారు. ఆయన అనారోగ్య కారణాల వల్లనే జర్మనీ నుండి రాలేక పోతున్నారని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. చెన్నమనేని వ్యక్తిగత పనుల నిమిత్తం ఇటీవల జర్మనీ వెళ్లారు. మిగిలిన ఎమ్మెల్యేలతో పాటు అతనికి కూడా టిఆర్ఎస్ విప్ జారీ చేసింది. దానికి చెన్నమనేని టిఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర రావుకు ఫోన్ చేసి ఆనారోగ్య కారణం వల్ల రాలేక పోతున్నానని వివరణ ఇచ్చుకున్నారు.

చెన్నమనేని 2009లో టిడిపి నుండి గెలిచారు. 2010లో తెలంగాణ కోసం రాజీనామా చేసి టిఆర్ఎస్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. కాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగత పనుల నిమిత్తం వారి వారి ప్రాంతాల్లో ఉండిపోయారు. అయితే చంద్రబాబు వారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి తప్పని సరిగా రావాల్సిందేనని హుకూం జారీ చేయడంతో వారు తమ పనులు వాయిదా వేసుకొని వస్తున్నట్లుగా సమాచారం. కాగా సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

English summary
TRS MLA Chennamaneni Ramesh will not attend to no-confidence motion because he is in Germany now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X