• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అవిశ్వాసంపై అసెంబ్లీలో వైయస్ విజయమ్మ స్పీచ్

By Srinivas
|

ys vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సోమవారం అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడనున్నారు. విజయమ్మ ఉదయం గం.9.45నిమిషాలకు లోటస్ పాండులోని తన నివాసం నుండి అసెంబ్లీకి బయలుదేరారు. ఆమెతో పాటు ఆదివారం వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీకి హాజరైన పంతొమ్మిది మంది శాసనసభ్యులు అసెంబ్లీకి బయలుదేరారు. వైయస్ విజయమ్మ గత జూన్ 3వ తేదిన శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుండి ఆమె సమావేశాలకు హాజరు కాలేదు.

అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆమె అసెంబ్లీకి హాజరవుతున్నారు. అసెంబ్లీకి బయలుదేరే ముందు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేస్తామని చెప్పారు. తాము ఎవరి ప్రలోభాలకు లొంగేది లేదని చెప్పారు. వైయస్ ఆశయసాధన కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు.

English summary
Pulivendula MLA YS Vijayamma will speak on no-confidence motion in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X