హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ సమర్థతపై స్పష్టత వచ్చింది: బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమర్థతపై అవిశ్వాస తీర్మానంతో స్పష్టతకు వచ్చామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం సరి కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. విప్ ధిక్కరించినవారి నుంచి వివరణ అడుగుతామని, దీనిపై ఐదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి పని చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. సభలో సోమవారం జరిగిన వ్యవహారాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొండ్రు మురళి ప్రతిస్పందిస్తారని, వారి అభిప్రాయమే తన అభిప్రాయమని, తాను ముందుగా ప్రతిస్పందించడం సరి కాదని ఆయన అన్నారు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు అనేది తాను గమనించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులంతా ప్రభుత్వానికి ఓటేసి సహకరించారని ఆయన అన్నారు. కాంగ్రెసు ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమని ప్రభుత్వానికి మద్దతిచ్చిన చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. మిత్రపక్షం మజ్లీస్ అండగా నిలిచిందని ఆయన అన్నారు.

ఆయా నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యుల కనుసన్నల్లోనే ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణ శాసనసభ్యులు, ఆంధ్ర శానససభ్యులు, రాయలసీమ శానససభ్యులు అంటూ వేర్వేరుగా ఉండరని, అందరూ కాంగ్రెసు శాసనసభ్యులేనని, పార్టీ ప్రభుత్వాన్ని పడగొడతామని అన్నప్పుడు పార్టీ శాసనసభ్యులుగా వ్యవహరించారని ఆయన అన్నారు. సభలో ఎత్తులకు పైయెత్తులు వేసినా తాము అవిశ్వాసాన్ని సమర్థంగా ఎదుర్కున్నామని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంపై విశ్వాసంతో కొంత మంది వెనక్కి వచ్చారని ఆయన అన్నారు. కొంత మంది శాసనసభ్యులు పార్టీకి చేసిన రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తాము దేనికి భయపడబోమని, ఎందుకు భయపడతామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. రైతులకు తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను చెప్పుకోవడానికి అవిశ్వాత తీర్మానం ప్రతిపాదన వల్ల అవకాశం లభించిందని ఆయన అన్నారు. చిరంజీవి మాటకు కట్టుబడి కాంగ్రెసు పార్టీ ప్రభుత్వానికి సహకరించారని ఆయన అన్నారు.

English summary
PCC President Botsa Satyanarayana said that the have got clarity on YSR Congress president YS Jagan's strength.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X