వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాసాన్ని రాజకీయం చేశారు: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడి తీరును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తప్పు పట్టారు. రైతుల కోసం ప్రతిపాదించామని చెప్పి అవిశ్వాసాన్ని రాజకీయం చేశారని ఆయన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను విమర్శించారు. విశ్వసనీయతను, విలువలను సమాధి చేశారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన నేపథ్యంలో గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్రకు విరామం ఇచ్చి వైయస్ జగన్ హైదరాబాదు వెళ్లారు. తిరిగి బుధవారం ఓదార్పు యాత్రను ప్రారంభించారు.

అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ విద్యార్థికి కూడా ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయలేదని ఆయన అన్నారు. 2009-10 సంవత్సరంలో 3200 కోట్ల రూపాయలు కేటాయించి, 900 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన అన్నారు. 2011-12 సంవత్సరంలో 2900 రూపాయలు కేటాయించిన నిధులతో బకాయిలు చెల్లించి ఫీజు రీయంబర్స్‌మెంట్ అమలు చేశామని చెప్పుకుంటోందని ఆయన విమర్శించారు.

English summary
YSR Congress president YS Jagan accused that Congress and TDP politicised No - confidence motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X