వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరానికి వ్యతిరేకంగా సాక్షిగా స్వామికి అనుమతి

By Pratap
|
Google Oneindia TeluguNews

P Chidambaram
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ స్కామ్ కేసులో కేంద్ర హోం మంత్రి పి. చిదంబరంపై చేసిన ఫిర్యాదుపై సాక్షిగా మారేందుకు ఢిల్లీ కోర్టు జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యన్ స్వామికి అనుమతి ఇచ్చింది. వాంగ్మూలం ఇవ్వడానికి ఈ నెల 17వ తేదీన విట్నెస్ బాక్స్‌లో హాజరు కావాలని స్వామిని కోర్టు ఆదేశించింది. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిదంబరం పాత్ర ఉందంటూ చేసిన ఫిర్యాదును పరిశీలిస్తుంది. కేసులో చిదంబరాన్ని కూడా భాగస్వామిని చేయాలని స్వామి కోర్టును కోరారు.

తీహార్ జైలులో ఉన్న టెలికం మాజీ మంత్రి ఎ రాజాతో కలిసి చిదంబరం స్పెక్ట్రమ్ ధరలను నిర్ణయించారని స్వామి ఆరోపించారు. స్పెక్ట్రమ్ ధరలను నిర్ణయించడానికి రాజా, చిదంబరం మధ్య నాలుగు సమావేశాలు జరిగాయని ఆయన చెప్పారు. రాజాతో అప్పటి ఆర్థిక మంత్రి మాట్లాడారని ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనను కూడా ఆయన ప్రస్తావించారు. స్పెక్ట్రమ్ ధరలపై రాజా, చిదంబరం కలిసే ఫార్ములాను రూపొందించారని ఆయన అన్నారు. విదేశీ కంపెనీలకు లైసెన్సుల విక్రయానికి అప్పటి ఆర్థిక మంత్రి అనుమతి ఇచ్చారని రాజా ఫైలులో, పత్రికా ప్రకటనలో నోట్ చేశారని ఆయన చెప్పారు.

English summary
A Delhi court on Thursday allowed Janata Party chief Subramanian Swamy to become a witness in his complaint against home minister P Chidambaram in 2G case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X