వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 ఏళ్ల విద్యార్థినిపై రేప్, ఎంఎంఎస్ చిత్రీకరణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rape
పంచకుల: పంజోర్‌లో ఓ యువకుడు 20 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కొద్ది కాలంగా అతను ఆ అమ్మాయిని గమనిస్తూ వస్తున్నాడు. కాలేజీకి వెళ్తుండగా గురువారంనాడు ఆమెను అడ్డుకుని అతను కిడ్నాప్ చేశాడు. నిందితుడిని 22 ఏళ్ల హితేష్‌గా పోలీసులు గుర్తించారు. అమ్మాయిని అతను కత్తితో బెదిరించాడు. ఆమె ప్రతిఘటించింది. అయితే, అతను ఆమెను పక్కనే ఉన్న ఖాళీ ఇంటిలోకి లాక్కుని వెళ్లి రేప్ చేశాడు. తనను అతను రేప్ చేసినట్లు ఆ అమ్మాయి ఆరోపించింది. ఆమెకు శరీరంపై గాయాలయ్యాయి. అతను రేప్ చేయడమే కాకుండా తన సెల్ ఫోన్‌తో చిత్రించి ఎంఎంఎస్ చేసి ఆమెకు పంపించాడు.

నిందితుడు అదే ప్రాంతంలోని మరో కాలేజీలో చదువుతున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనులకు వెళ్తారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అమ్మాయి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. భర్త తిరిగి వచ్చిన తర్వాత ఆమె తమ కూతురు అత్యాచారానికి గురైన విషయాన్ని తెలిపింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలని వైద్య పరీక్షలకు పంపించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎంఎంఎస్ సంఘటనను ధ్రువీకరిస్తోంది. ప్రేమను తిరస్కరించడం వల్లనే అమ్మాయిపై అతను అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

English summary
A 20-year-old student was allegedly raped on Thursday in Pinjore by a youth who had been stalking her for a while. The girl was abducted from close to her house while she was going to college on foot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X