వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్‌ను అడగండి: విమర్శలపై ఒబామా ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Barack Obama
వాషింగ్టన్: తన విదేశాంగ విధానంపై వస్తున్న విమర్శలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా మండిపడ్డారు. తాను బుజ్జగింపు విధానాన్ని అనుసరిస్తున్నానేమో ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను అడగాలని ఆగ్రహంగా అన్నారు. తాను విదేశాంగ విధానం విషయంలో బుజ్జగింపు వైఖరిని అవలంబిస్తున్నానేమోనని లాడెన్‌ను అడగండని ఆయన అన్నారు. ఈ విషయంపై 30 మంది ఆల్ ఖైదా నేతల్లో క్షేత్రంలో లేకుండా పోయిన 22 మందిని అడగండని ఆయన అన్నారు.

అమెరికా విదేశాంగ శాఖ పని వ్యవహారాలు నడపడమని, కానీ బుజ్జగింపు వైఖరిలో పడిపోయిందని రిపబ్లికన్ అభ్యర్థి న్యువెట్ గింగ్రిచ్ అన్నారు. దీనిపై తాను ఆందోళనగా ఉన్నానని అన్నారు. అంతర్జాతీయంగా అధ్యక్షుడు బుజ్జగింపుల వ్యూహాన్ని అనుసరిస్తున్నారని, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి కోసం పోటీ పడుతున్న మిట్ రోమ్నే అన్నారు. అమెరికా విశ్వాసం, బలం, భవిష్యత్తుపై విశ్వాసాన్ని బుజ్జగింపుల వైఖరి దెబ్బ తీస్తుందని అన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి కోసం అభ్యర్థిగా పోటీ పడుతున్నవారి నుంచి ఒబామా తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్నారు. ఈ విమర్శలపై ఒబామా ప్రతిస్పందించారు.

English summary
"Ask Osama bin Laden," said an otherwise calm US President Barack Obama in an icy riposte to fierce criticism from several Republican White House hopefuls alleging that he was following a policy of appeasement on the foreign policy front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X