వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్కామ్‌లో చిదంబరాన్ని వెనకేసుకొస్తున్న ప్రభుత్వం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kapil Sibal
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో హోం మంత్రి పి. చిదంబరాన్ని కేంద్ర ప్రభుత్వం వెనకేసుకొస్తోంది. 2జి స్కామ్ వ్యవహారంలో బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ చిదంబరంపై ఆరోపణలు చేయడాన్ని టెలికం మంత్రి కపిల్ సిబాల్ తప్పు పట్టారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్తంభించే విధంగా ఎన్‌డిఎ వ్యవహరిస్తోందని ఆయన శనివారం విమర్శించారు. చిదంబరంపై వస్తున్న ఆరోపణలను అన్నింటినీ ప్రభుత్వం తిరస్కరిస్తోందని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో చిదంబరం పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్‌డిఎలోని కొన్ని శక్తులు చిదంబరంపై బురద చల్లి అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.

టెలికం ఆపరేటర్లకు 2జి స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి ఇంటెంట్ లెటర్స్ ఇవ్వడానికి ముందు మాజీ టెలికం మంత్రి ఎ రాజా అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరంతో ఎటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఆయన చెప్పారు. 2008 జనవరి 10వ తేదీన ఇంటెంట్ లెటర్స్ ఇస్తారనే విషయం ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియదని ఆయన చెప్పారు. రాజా నేతృత్వంలోని టెలికం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఇంటెంట్ లెటర్స్‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలా బాధ్యత వహిస్తుందని ఆయన అడిగారు.

English summary
Coming out in strong defense of home minister P Chidambaram, Kapil Sibal on Saturday attacked the BJP-led NDA of attempting to "foist" culpability on him in the 2G scam saying it was a desperate attempt to make Parliamentary democracy dysfunctional.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X