వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి సహాయ మంత్రి? స్వతంత్ర హోదాలో ఛాన్స్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెసు పార్టీ అధిష్టాం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అవిశ్వాసం సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టిన చిరంజీవి, ఆయన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఆయనకు పాలనలో అనుభవం లేనందున ప్రస్తుతానికి స్వతంత్ర హోదాలో సహాయ మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఆపత్కాలంలో పార్టీని కాపాడిన చిరు, ఆయన వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అంశంపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ గులాం నబీ ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శనివారం చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్ర కేబినెట్లోనూ చిరంజీవి వర్గం ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యం సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని కిరణ్ కూడా యోచిస్తున్నారట. అదే విషయాన్ని అధిష్టానానికి చెప్పినట్లుగా సమాచారం. ఇటీవల ఖాళీ అయిన మంత్రి పదవులను చిరు వర్గంతో భర్తీ చేయాలని చూస్తున్నారట. అయితే మంత్రివర్గ విస్తరణ విషయంలో మాత్రం అధిష్టానం సిఎంకు మరోసారి మొండిచేయి చూపినట్లుగా తెలుస్తోంది. చిరు సోమ, మంగళ వారాల్లో ఢిల్లీ వెళుతున్నారు. ఈ పర్యటనలో చిరు పదవి దాదాపు ఖరారు కావచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చిరుతో పాటు శనివారం కేంద్రానికి మద్దతు ప్రకటించిన ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్, టిఎంసికి చెందిన మరో ఎంపికి కూడా సాధ్యమైనంత త్వరలో కేంద్ర పదవులు కట్టబెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
It seems, Chiranjeevi may get central ministry in this Delhi tour. Sonia Gandhi called Chiranjeevi to Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X