గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం కిరణ్ కుమార్ అబద్దాలు చెబుతున్నారు: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ys jagan
గుంటూరు: విద్యార్థులను అడిగితే ఫీజు రీయింబర్సుమెంట్ కింద ఒక్క రూపాయి ఇవ్వలేదని చెబుతుండగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియేమో డబ్బులు అన్నీ చెల్లించామని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం గుంటూరు జిల్లాలో జరిగిన తన ఓదార్పు యాత్రలో విమర్శించారు. మరో నాలుగు నెలలు గడిస్తే విద్యా సంవత్సరం అయిపోతుందని అయినప్పటికీ విద్యార్థుల ఫీజులు కట్టాలన్న కనీస ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు.

పథకాలు పేదలకు అందాలన్న ఆలోచనతో వైయస్ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం అందులో విఫలమైందని విమర్శించారు. ఇవాళ అధ్వాన్న పాలకుల చేతిలో రాష్ట్రం ఉందన్నారు. ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే ఇళ్లు ఇస్తామనడం ఎంత వరకు సమంజసమన్నారు. దేశ చరిత్రలోనే ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారన్నారు. రాష్ట్రంలో రైతుల స్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy said that CM Kiran Kumar Reddy told lies in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X