వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనర్హత: జగన్‌వర్గం ఎమ్మెల్సీల వంతు, ఢిల్లీకి బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

ys jagan
హైదరాబాద్: అవిశ్వాసం తీర్మానంలో పార్టీ విప్ ధిక్కరించి ఓటు వేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చెందిన పదహారు మంది ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు నిర్ణయించుకున్న కాంగ్రెసు పార్టీ తాజాగా శాసనమండలి సభ్యులపై కూడా చర్యలు తీసుకొనేందుకు సిద్ధమవుతోంది. జగన్‌తో వెళుతున్న ఐదుగురు కాంగ్రెసు ఎమ్మెల్యేలపై శాసనమండలి చైర్మన్‌కు త్వరలో కాంగ్రెసు ఫిర్యాదు చేయనుందని సమాచారం.

జగన్ వర్గంలో ఉన్న కొండా మురళీ, జూపూడి ప్రభాకర రావు, పుల్లా పద్మావతి, ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులపై అనర్హత పిటిషన్ చైర్మన్‌కు ఇవ్వనున్నారు. ఉదయం పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకునే అంశం కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా ఎమ్మెల్యేలపై మంగళవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేసే అవకాశముంది. మరోవైపు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం.

English summary
Congress ready to take action on YS Jaganmohan Reddy camp mlcs after mlas. Party will give petition to chairman soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X