వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ.ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన ఎంఎస్ రెడ్డి కన్నుమూత

By Srinivas
|
Google Oneindia TeluguNews

ms reddy
హైదరాబాద్: ప్రముఖ రచయిత, నిర్మాత ఎంఎస్ రెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎంఎస్ రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి. మల్లెమాల పేరుతో ఈయన రచనలు చేశారు. ఇటీవలె ఇది నా కథ పేరుతో ఆత్మకథను విడుదల చేశారు. ఈ ఆత్మకథ వివాదాస్పదం అయింది. ఇతను 1925లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అలివిరి గ్రామంలో జన్మించారు. సిని నిర్మాతగా, కవిగా, రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నటుడిగాను సుపరిచితులు.

ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఎంఎస్ రెడ్డి తనయుడు. తలంబ్రాలు, అంకుశం, ఆగ్రహం, ఆహుతి, అమ్మోరు, బాల రామాయణం, అరుంధతి, పల్నాటి సింహం, ఏకలవ్య వంటి పలు హిట్ చిత్రాలను ఇతను అందించారు. నిర్మాతగా మొదటి చిత్రం భార్య. రాజశేఖర్ ప్రధాన పాత్ర పోషించిన అంకుశం చిత్రంలో ఎంఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా కనిపించారు. బాల రామాయణం చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. నలభై ఏళ్లు సినీ పరిశ్రమకు ఈయన సేవలు అందించారు. రామాయణం చిత్రంతో జాతీయ పురస్కారం అందుకున్నారు.

ఎంఎస్ రెడ్డి మృతి వార్త తెలిసిన ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ సినీ పరిశ్రమ భీష్మ పితామహుడిని కోల్పోయిందన్నారు. ఉదయాన్నే బాధాకరమైన వార్త వినవలసి వచ్చిందన్నారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆయన మృతి వార్త విని విషాదంలో మునిగి పోయారు.

English summary
Well known writter and producer MS Reddy died today in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X