వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌పాల్‌కు ఎన్టీఆరే ఆద్యుడు!: ఢిల్లీలో ఎర్రన్నాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errannaidu
న్యూఢిల్లీ: లోక్‌పాల్‌కు దివంగత తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు ఆద్యుడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు ఆదివారం ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే దీక్ష వేదికపై ప్రసంగిస్తూ అన్నారు. 1984లోనే రాష్ట్ర అసెంబ్లీలో ఎన్టీఆర్ లోక్‌‍పాల్ బిల్లు తీసుకు వచ్చారన్నారు. అన్నా హజారే చేస్తున్న ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు. అన్నాకు తాము మొదటి నుండి అండగా ఉంటున్నామని చెప్పారు.

సిబిఐని లోక్‌పాల్ పరిధిలోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై సిబిఐ ద్వారా కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటోందని విమర్శించారు. అవినీతిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాగా ఎర్రన్నాయుడు మాట్లాడుతుండగా తెలంగాణవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

English summary
TDP senior leader Errannaidu said that late NT Rama Rao produced lokpal bill in AP Assembly in 1984.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X