వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేటు వేయాలని ఫిర్యాదు: కాంగ్రెసు వర్సెస్ జగన్ వర్గం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

kondru murali - sobha nagi reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేటు వేయాలని ఓవైపు కాంగ్రెసు స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా మరోవైపు ఉప ఎన్నికలలోనే తేల్చుకుంటామని జగన్ ఎమ్మెల్యేలు సవాల్ విసురుతున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న జగన్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని తాము కోరినట్లు ప్రభుత్వ చీప్ విప్ కొండ్రు మురళి సోమవారం స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం చెప్పారు. సంవత్సర కాలంగా వారికి నచ్చజెప్పి చూశామని అయితే అవిశ్వాసంలో వ్యతిరేకంగా ఓటు వేసినందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. పూతలపట్టు ఆరోగ్యం సరిగా లేనందునే ఓటింగుకు హాజరు కాలేదని చెప్పారు.

కాంగ్రెసులో స్వేచ్ఛ ఉందని, రైతుల కోసం కిరణ్ ప్రభుత్వం చాలా చేస్తుందన్నారు. ప్రజలు జగన్ మాట నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. జగన్ ఎమ్మెల్యేలు ప్రజా విశ్వాసం కోల్పోతున్నారన్నారు. పార్టీలో చర్చించాకే సోమారపు సత్యనారాయణపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. క్రమశిక్షణా రాహిత్యాన్ని కాంగ్రెసు క్షమించదని మంత్రి శైలజానాథ్ అన్నారు. కాగా తాను స్వతంత్ర ఎమ్మెల్యేనని తనపై వేటు వేసే అధికారం లేదని సోమారపు చెబుతున్నారు.

తమపై ఫిర్యాదు చేశారన్న అంశంపై శోభా నాగి రెడ్డి, చెన్నకేశవ రెడ్డి స్పందించారు. తాము ఉప ఎన్నికల్లో తేల్చుకుంటామని చెబుతున్నారు. పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేసిన సమయంలోనే తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పీకర్‌కు లేఖ రాశానని అలాంటప్పుడు తనపై వేటు ఎలా వేస్తారని శోభా నాగి రెడ్డి ప్రశ్నించారు. ఇది ఏ రకమైన నీతికి నిదర్శనమని ఆమె అన్నారు.

English summary
Cheap whip Kondru Murali talk with media after met speaker that he appealed speaker to take action on Jagan camp mlas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X