వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీ గురించి చెబుతాం!: విజయ సాయి రెడ్డి, ఎబికె

By Srinivas
|
Google Oneindia TeluguNews

vijaya sai reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తదితరులు వేసిన పిటిషన్లపై విచారణలో తమను ఇంప్లీడ్ చేయాలని సాక్షి వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి, సీనియర్ పాత్రికేయులు ఎబికె ప్రసాద్ సోమవారం హైకోర్టులో ఓ ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశారు. తమ వాదన సైతం వినాలని వారు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను తమ వాదన వినకుండా సడలించవద్దని కోరారు. బాబు తదితరులపై సిబిఐ ప్రాథమిక విచారణకు ఇచ్చిన ఆదేశాలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వాదోపవాదాలు సాగుతున్న క్రమంలో వీరిద్దరూ ఒకే పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.

ఈనాడుతో పాటు పలు దిన పత్రికలకు ఫౌండర్ ఎడిటర్‌గా పని చేసిన తనకు పలు విషయాలు తెలుసునని, వాటిని కోర్టు దృష్టికి తీసుకురావడం కోసమే ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు ఎబికె పేర్కొన్నారు. పన్ను ఎగవేతకు రామోజీ పలు గిమ్మిక్కులకు పాల్పడ్డారని, కంపెనీలు నష్టాల్లో ఉన్నట్లు చూపించారని పేర్కొన్నారు. ఐటి అధికారులు జారీ చేసిన నోటీసులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మార్గదర్శి, ఉషోదయ టివి, ఉషా కిరణ్ మూవీస్ తదితర వాటిని ప్రస్తావించారు. బాబు హయాంలో రామోజీ కంపెనీలు ప్రయోజనాలు పొందాయని పేర్కొన్నారు.

English summary
Vijaya Sai Reddy and ABK Prasad filed implead petition in high court on Chandrababu Naidu properties case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X