హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేధింపుల కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య ఆత్మహత్య!

By Srinivas
|
Google Oneindia TeluguNews

hyderabad
హైదరాబాద్: భర్త ఉద్యోగం చేయమని వేధిస్తున్నాడని సూసైడ్ నోట్ రాసి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భార్య సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కూకట్ పల్లిలోని వెంకట్రావ్ నగర్‌లో ఉంటున్న హరికృష్ణ, నీలిమకు గత సంవత్సరం ఏప్రిల్‌లో వివాహం అయింది. వీరికి కీర్తన్ అనే బాబు ఉన్నారు. హరికృష్ణ ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎంసిఏ పూర్తి చేసిన నీలిమ ఇంట్లోనే ఉంటోంది. సోమవారం ఉదయం హరికృష్ణ విధులకు వెళ్లాక నీలిమ తన తండ్రికి ఫోన్ చేసి భర్త వేధింపులు భరించడం నా వల్ల కాదంటూ ఫోన్ చేసి స్విచ్చాఫ్ చేసింది.

కంగారుపడిన తండ్రి కూకట్ పల్లిలో ఉంటున్న బంధువులకు సమాచారం అందించాడు. అక్కడకు వెళ్లిన వారికి నీలిమ ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. భర్త నన్ను ఉద్యోగం చేయాలని కొన్ని నెలలుగా ఇబ్బంది పెడుతున్నాడని ఓ సూసైడ్ నోట్ పక్కనే ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు. తమ కుమార్తె ఆత్మహత్యకు అల్లుడే కారణమని నీలిమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

English summary
A software employee wife committed to 
 
 suicide by her husband tourcher.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X