వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికీలీక్స్ వద్ద నల్లధన భారతీయుల జాబితా: అద్వానీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

lk advani
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో నల్లధనం ఉన్న భారతీయల జాబితా వికీలీక్స్ వద్ద ఉందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ బుధవారం లోక్‌సభలో అన్నారు. స్విస్ బ్యాంకుల్లో మన దేశానికి చెందిన 25 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని ఆయన అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ నల్లధనం వినియోగిస్తున్నారని విమర్శించారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం వెనక్కి తీసుకు రావడానికి కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో వివరించాలన్నారు.

కేంద్రం వెంటనే బ్లాక్ మనీ దాచుకున్న వారి పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ ధనాన్ని దేశానికి రప్పించి అభివృద్ధికి వినియోగించాలన్నారు. తమకెవరికీ స్విస్‌లో అకౌంట్లు లేవని ఎంపీలందరూ ప్రకటించాలన్నారు. 782 మంది ట్యాక్స్ ఎగ్గొట్టి బ్యాంకుల్లో నల్ల ధనం దాచి ఉంచారన్నారు. వారి పేర్లు ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే తాము వాయిదా తీర్మానం ఇచ్చామన్నారు.

English summary
Advani on Wednesday asked the government to make public the names of over 782 Indians who have illegally stashed in foreign banks their wealth amounting to an estimated Rs.25 lakh crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X