• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సోనియాపై జగన్ వ్యాఖ్యలు: మండిపడ్డ వీర శివా రెడ్డి

By Srinivas
|

Veera Siva Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తొడగొట్టి కవ్విస్తే టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారని కాంగ్రెసు ఎమ్మెల్యే వీర శివా రెడ్డి మంగళవారం విమర్శించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి యుపిఏ చైర్ పర్సన్ పదవి దివంగత వైయస్ భిక్షే అన్న జగన్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కిరణ్ సిఎంగా బాధ్యతలు చేపట్టి సంవత్సరమే అవుతుందని కాబట్టి ఉప ఎన్నికలు రిఫరెండం కాదని చెప్పారు. అందరూ సమష్టి కృషి చేస్తే కాంగ్రెసు గెలుపు ఖాయమన్నారు. గెలుపోటములకు ఏ ఒక్కరి బాధ్యత ఉండదన్నారు.

అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా జగన్‌ను చంద్రబాబు రాజకీయంగా ఓడిస్తే, చంద్రబాబును జగన్ రాజకీయంగా ఉరితీశారని, జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సగం స్థానాల్లో టిడిపికి డిపాజిట్లు దక్కవని అన్నారు. కాంగ్రెస్ గెలుపు ఓటములకు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలంతా సమష్టి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. జగన్ పదిహేడు మంది ఎమ్మెల్యేలను బలిపశువులను చేశాడన్నారు.

English summary
MLA Veera Siva Reddy fired at YSR Congress party chief YS Jaganmohan Reddy for his comments against Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X