వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై బిజెపి ప్రైవేట్ బిల్లు, మద్దతు కోసం టిఆర్ఎస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prakash Jawadekar
న్యూఢిల్లీ/హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో తెలంగాణపై ప్రైవేట్ బిల్లును శుక్రవారం ప్రవేశ పెట్టనుంది. ఈ బిల్లును ఆ పార్టీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ ప్రవేశ పెడతారు. శుక్రవారం ఈ బిల్లుపై చర్చించేందుకు రాజ్యసభ చైర్మన్ అనుమతి ఇచ్చారు. ఈ చర్చలు బిజెపి, కాంగ్రెసు, టిఆర్ఎస్ తదితర పార్టీలు పాల్గొననున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు చర్చ జరగనుంది. కాగా బిజెపి ప్రవేశ పెట్టే ప్రైవేట్ తెలంగాణ బిల్లు తీర్మానానికి టిఆర్ఎస్ మద్దతు కూడగడుతోంది.

టిఆర్ఎస్ మాజీ ఎంపి వినోద్ కుమార్ విపక్ష నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. బిల్లుకు కాంగ్రెసు సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని టిఆర్ఎస్ అంటోంది. ప్రత్యేక రాష్ట్రాలకు, అలాగే తెలంగాణకు అనుకూలంగా ఉన్న పార్టీలను టిఆర్ఎస్ కలుస్తోంది. ఎన్సీపి, సిపిఐ, జెడియు, బిఎస్పీ తదితర పార్టీల మద్దతు కోరుతోంది.

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న నళినికి మద్దతుగా టి-లాయర్లు హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, పలువురు జెఏసి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు. కేంద్రం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో బిజెపి పెట్టిన ప్రైవేట్ బిల్లు చర్చలో కాంగ్రెసు తెలంగాణపై స్పష్టత ఇవ్వాలన్నారు.

English summary
BJP produced private bill on Telangana in Rajya Sabha. Prakash Javadekar producer bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X