హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొట్టి శ్రీరాములే స్ఫూర్తి, సమైక్యవాది కాదు: కోదండరామ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మత్యాగం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములును తాము సమైక్యవాదిగా చూడడం లేదని ఓ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిగా ఆయన్ను గౌరవిస్తామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ బుధవారం అన్నారు. ఆయన వర్ధంతి రోజున రెండు నిమిషాలు మౌనం పాటించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో వెనుక దుష్ట రాజకీయాలున్నాయని ఆరోపించారు. పొట్టి శ్రీరాములు విశాలాంధ్ర కోసం పోరాటం చేయలేదన్నారు. ఆయన వర్ధంతి రోజున ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం బలిదానం చేసిన వ్యక్తిగా జోహార్లు అర్పిస్తూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోస్టర్లు అంటిస్తామని వెల్లడించారు.

తాము పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఎన్నికల సమయంలో తెలంగాణ ఇస్తానని చెప్పి డిసెంబర్ 9న ప్రకటన చేసి ఆ తర్వాత మాట తప్పిందన్నారు. తెలంగాణను సాధించుకోవడంలో కాంగ్రెస్ వాదులు విఫలమైనారన్నారు. కాగా తెలంగాణలో చంద్రబాబు యాత్రను అడ్డుకోవాలని తాము ఏనాడూ అనలేదని కోదండరామ్ స్పష్టం చేశారు. ఎవరైనా అటువంటి పిలుపునిస్తే ఉపసంహరించు కుంటున్నామనీ చెప్పారు.

English summary
Telangana JAC chairman Kodandaram said on Wednesday, Potti Sriramulu is our inspiration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X