వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దీక్ష విరమించిన మాజీ డిఎస్పీ తెలంగాణ నళిని

By Pratap
|
Google Oneindia TeluguNews

Nalini
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన నిరాహార దీక్షను మాజీ డిఎస్పీ నళిని శుక్రవారం విరమించారు. బిజెపి నేత ప్రకాష్ జవదేకర్ నిమ్మరసం ఇచ్చి ఆమె చేత దీక్ష విరమింపజేశారు. ఆమె 8 రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. శుక్రవారం ఉదయం వైద్యులు ఆమెను పరీక్షించారు. ఆమె 8 కిలోల బరువు తగ్గినట్లు వైద్యులు తేల్చారు. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు వారు చెప్పారు. దీక్ష విరమించాలని వైద్యులు ఆమెకు సూచించారు. మరోవైపు ఢిల్లీలో ఉష్ణోగ్రత విపరీతంగా పడిపోయింది.

ప్రస్తుత స్థితిలో దీక్ష కొనసాగించడం మంచిది కాదని ప్రకాష్ జవదేకర్ సూచించి, ఆమె చేత దీక్ష విరమింపజేశారు. తనను సీమాంధ్ర అధికారులు వేధిస్తున్నారని నళిని గతంలో విమర్శలు చేశారు. తాను తెలంగాణకు చెందడం వల్లనే వేధింపులకు దిగుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసి నిబంధనలను ఉల్లంఘించినందుకు డిఎస్పీ పదవి నుంచి డిజిపి దినేష్ రెడ్డి ఆమెను సస్పెండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం ఎనిమిది రోజుల క్రితం ఆమె ఢిల్లీలో దీక్ష చేపట్టారు.

English summary
Former DSP Nalini has withdrawn her fast, which was takenup demanding statehood for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X