వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానికి అన్నాహజారే లేఖ, లోక్‌పాల్ బిల్లుపై సందేహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: ఈ పార్లమెంటు సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లు ప్రతిపాదిస్తారా, లేదా అనే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సామాజిక కార్యకర్త అన్నా హజారే ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు తాజాగా శనివారం ఓ లేఖ రాశారు. ఈ నెల 23వ తేదీలోగా పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించకపోతే జైలో భరో కార్యక్రమం చేపడుతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ప్రవర్తన సరిగా లేదని ఆయన ప్రధానికి రాసిన నాలుగు పేజీలో లేఖలో ఆయన అన్నారు. లోక్‌పాల్ బిల్లులో చేరుస్తామని రాతపూర్వకమైన హామీ ఇచ్చి కూడా సిటిజన్స్ చార్టర్‌ను చేర్చకూడదని మన్మోహన్ సింగ్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ఆయన అడిగారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పటిష్టమైన లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెడతామని గత కొన్ని నెలలుగా తనకు రాసిన లేఖల్లో ప్రధాని హామీ ఇస్తూ వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఏడాది పాటుగా ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లుపై హామీలు ఇస్తూ కూడా దేశ ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రధాని మాటను నమ్మి తాము పార్లమెంటు శీతాకాలం సమావేశాల వరకు తమ ఆందోళనలను ఆపేశామని ఆయన చెప్పారు. ఈ శీతాకాలం సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లు ప్రవేశపెడుతారనే నమ్మకం లేకుండా పోయిందని ఆయన అన్నారు.ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రతిపాదించకపోతే తాను డిసెంబర్ 27వ తేీదన దీక్షకు దిగుతానని, డిసెంబర్ 30వ తేదీ నుంచి జైల్ భరో కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు.

English summary
Anna Hazare on Saturday wrote a fresh letter to Prime Minister Manmohan Singh, saying doubts have arisen over whether Lokpal Bill will be passed by December 23 when Parliament session gets over and threatened to go ahead with his proposed fast and 'jail bharo' agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X