వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిలయన్స్ అధినేత ముకేష్‌పై అరెస్టు వారంట్ జారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Mukesh Ambani
త్రిసూరు: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీపై కేరళలోని త్రిసూరు జిల్లా వినియోగదారుల ఫోరం కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది. ఓ మొబైల్ ఫోన్ సర్వీస్ కస్టమర్ ఇచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకుని కోర్టు ఈ వారంట్ జారీ చేసింది. వినియోగదారుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంతో కోర్టు ఈ వారంట్ జారీ చేసింది. ఇది 2003లో జరిగిన విషయం. జోసెఫ్ అనే వ్యక్తి 24 వేల రూపాయలకు రిలయన్స్ ఇన్ఫోకామ్ మొబైల్ కొన్నాడు. ఆ సమయంలో అతనికి ఉచితంగా ఔట్ గోయింగ్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు. కానీ అవేవీ అందుబాటులోకి రాలేదు. ఎన్ని విజ్ఞప్తులు చేసిన పట్టించుకోలేదు. దీంతో అతను 2005లో త్రిసూరు వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరంలో ఓ పిటిషన్ దాఖలు చేశాడు.

పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత జోసెఫ్‌కు అనుకూలంగా వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది. ఐదేళ్లకు 12 శాతం వడ్డీతో జోసెఫ్‌కు 24 వేల రూపాయలు చెల్లించాలని వినియోగదారుల ఫోరం రిలయన్స్ ఇన్ఫోకామ్‌ను ఆదేశించింది. డబ్బుల కోసం ఏడాది పాటు నిరీక్షించాడు. అవి తనకు అందకపోవడంతో జోసెఫ్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో త్రిసూర్ వినియోగదారుల ఫోరం అంబానీపై అరెస్టు వారంట్ జారీ చేయడమే కాకుండా ఫిబ్రవరి 15వ తేదీలోగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.

English summary
A consumer court in Thrissur district in Kerala has issued an arrest warrant against Reliance Industries chairman and the richest person in India, Mukesh Ambani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X