వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిక్కర్ సిండికేట్స్ సోదాలపై ఎసిబి సమీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

ACB Logo
హైదరాబాద్: రాష్ట్రంలోని లిక్కర్ సిండికేట్స్‌పై తాము జరిపిన సోదాలపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఉన్నతాధికారులు సోమవారం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ సిండికేట్స్‌పై ఎసిబి నిర్వహించిన సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లిక్కర్ సిండికేట్స్ వ్యవహారంలో రాజకీయ నాయకులకు, శాసనసభ్యులకు, మంత్రులకు, మీడియా ప్రతినిధులకు పాత్ర ఉందని, వారికి పెద్ద యెత్తున ముడుపులు అందాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎసిబి ఉన్నతాధికారుల సమీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. సమీక్ష అనంతరం ఎసిబి ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది.

ఎసిబి డైరెక్టర్ భూపతిబాబు అధ్యక్షతన అదనపు డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు సమావేశమై సోదాలపై సమీక్ష నిర్వహించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై లిక్కర్ సిండికేట్ల విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నాలుగు జిల్లాల్లో ఆయన హవా సాగుతోందని మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోదాల వివరాలను వెల్లడించాలని బొత్స సత్యనారాయణ ఎసిబికి సూచించారు.

English summary
ACB has reviewed on raids conducted on liqour syndicates in Andhrapradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X