వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిపిఎస్సీలో గోల్‌మాలంటూ కెసిఆర్ కూతురు ఆందోళన

By Srinivas
|
Google Oneindia TeluguNews

kalvakuntla kavitha
హైదరాబాద్: ఎపిపిఎస్సీలో గోల్‌మాల్ జరిగిందంటూ టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ఆందోళనకు దిగారు. గ్రూప్ వన్ పరీక్షల్లో గోల్‌మాల్ జరిగిందంటూ తెలుగు మీడియం విద్యార్థులు ఎపిపిఎస్సీ వద్ద ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా పట్ల పక్షపాతం చూపించారంటూ కార్యాలయం ముందు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. వీరికి కల్వకుంట్ల కవిత మద్దతు పలికారు. ఆమె ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎపిపిఎస్సీ పూర్తిగా అవినీతిమయమైపోయిందని ఆమె ఆరోపించారు. దానిపై తమకు నమ్మకం లేదని పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సిఎం సొంత జిల్లాలో ఏడు వందల మంది పరీక్ష రాస్తే వందకు పైగా సెలక్ట్ అయ్యారని, అదే వరంగల్ జిల్లాలో ఆరువందల మంది రాస్తే పదకొండు మంది మాత్రమే సెలక్ట్ అయ్యారని, దీనిపై తమకు ముఖ్యమంత్రి స్థాయిలో అక్రమాలు జరిగాయన్న అనుమానాలు ఉన్నాయన్నారు.

బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలుగు ప్రొఫెసర్లతో దిద్దించకుండా ఇంగ్లీష్ ప్రొఫెసర్లతో దిద్దించారని విమర్శించారు. కాగా ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులు, కవితను ఎపిపిఎస్సీ కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య చర్చలకు పిలిచారు. కాగా తెలంగాణ విద్యార్థుల పట్ల సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కెటి రామారావు విమర్శించారు. విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్నందుకే సిఎం వారిని టార్గెట్ చేశారన్నారు. సీమాంధ్ర అధికారులపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిఎం ప్రకటించిన లక్ష ఉద్యోగాల్లో తెలంగాణకు ఎన్ని ఉద్యోగాలో చెప్పాలన్నారు.

English summary
TRS chief K Chandrasekhar Rao daughter 
 
 Kalvakuntla Kavitha make agitation at APPSC and 
 
 demanded for cancel gruop-1 exams.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X