హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల అనుచరుడు చమన్‌పై హత్య కేసు కొట్టివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులోని అమీర్‌పేటలో జరిగిన హత్య కేసును మాజీ మంత్రి పరిటాల రవి అనుచరుడు చమన్‌పై నాంపల్లి కోర్టు సోమవారం కొట్టేసింది. అమీర్‌పేటలో 2005లో జరిగిన బిల్డర్ హత్యపై ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. ఆస్తి వివాదం వల్ల ప్రత్యర్థులు పరిటాల రవి అనుచరులతో అతన్ని హత్య చేయించినట్లు పోలీసులు నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీ, పరిటాల మరో అనుచరుడు పోతుల సురేష్ తదితరులపై గతంలోనే కోర్టు కేసును కొట్టేసింది.

చమన్ ఇటీవలే పోలీసులకు లొంగిపోయారు. బిల్డర్ హత్య కేసులో చమన్ పాత్రపై కోర్టు విచారణ జరిపింది. తగిన సాక్ష్యాధారాలు లేనందున అభియోగాలను కొట్టేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. పరిటాల రవి హత్యానంతరం చమన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పరిటాల రవి ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య తర్వాత ఆయన పోలీసులకు లొంగిపోయారు. చమన్‌పై పలు పోలీసు కేసులున్నాయి.

English summary
Nampally court has quashed murder case against Paritala Ravi's follower Chaman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X