• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాల్చేయండి: కర్నూలు ఎస్పీ సంచలన ఆదేశాలు

By Bojja Kumar
|
Kurnool Map
కర్నూలు: జిల్లాలో హత్యలు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) సోమవారం పోలీసులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. హత్యా స్థలంలో నిందితులు కనిపిస్తే కాల్చేయాలని ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నిందితులు వాహనంలో పారిపోతుంటే వాహనం టైర్లను పేల్చేయాలని ఆయన ఆదేశించారు. హత్య కేసుల్లో అలా చేస్తే విచారణ ఉండదని ఆయన చెప్పారు. నిందితులకు నేరుగా శిక్ష వేయాలని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీసూ ఆయుధాన్ని దగ్గర ఉంచుకోవాలని, సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకూడదని ఆయన అన్నారు.

కర్నూలు జిల్లాలో గత కొద్ది రోజులుగా పెద్ద యెత్తున హత్యలు జరుగుతున్నాయి. నెలకు పది నుంచి 15 హత్యలు జరుగుతున్నట్లు సమాచారం. సోమవారం కూడా ఓ హత్య జరిగింది. పోలీసులంటే భయం లేకుండా పోయిందని ఎస్పీ అభిప్రాయపడుతున్నారు. గత 15 రోజుల వ్యవధిలో ఆరు హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. రౌడీ షీటర్లు, పాతకక్షలు పెట్టుకున్నవారు ఇష్టారాజ్యంగా హత్యలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kurnool SP Shivaprasad ordered police to fire at culprits at the movement in murder incidents.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more