వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యాలో భగవద్గీత నిషేధ అంశంపై అట్టుడికిన లోక్‌సభ

By Srinivas
|
Google Oneindia TeluguNews

parliament
న్యూఢిల్లీ: హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై రష్యాలో నిషేధం విధంచాలంటూ ఒకరు అక్కడ కోర్టుకెక్కిన విషయంపై సోమవారం భారత పార్లమెంటు అట్టుడికింది. భగవద్గీత నిషేధం వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని పలువురు పార్లమెంటు సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. భగవద్గీతను నిషేధించాలని డిమాండ్ చేయడం ద్వారా రష్యాలో ఉన్న హిందువుల హక్కులను కాలరాసినట్లే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ఎంపీల తీవ్ర నిరసన కారణంగా స్పీకర్ సభను వాయిదా వేశారు. బిజెడి నేత భర్తృహరి మెహ్తాబ్ భగవద్గీత అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంపై తీవ్రస్థాయిలో మండిపడింది.

ఈ విషయంపై మన ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. రష్యాలో ఉన్న హిందువుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. అధికారుల ద్వారా ఈ అంశంపై ప్రభుత్వం ఒత్తిడి
తీసుకు రావాలని డిమాండ్ చేశారు. హిందూ మత గ్రంథాలు ఉగ్రవాదాన్ని బోధించలేదని ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. కాగా మాస్కోలోని భారతీయులు, మరియు ఇస్కాన్ సంస్థ ఈ అంశంలో కలుగజేసుకోవాల్సిందిగా
భారత ప్రభుత్వాన్ని కోరింది. కాగా లోక్‌పాల్ బిల్లు కోసం పార్లమెంటు సమావేశాలు పొడిగించే అవకాశాలు ఉన్నాయి.

English summary
Parliamentarians across the political spectrum 
 
 on Monday asked the government to ensure that 
 
 the religious rights of Hindus in Russia are 
 
 protected after a member pointed out an IANS 
 
 report about the Bhagvad Gita facing a ban and 
 
 the prospect of it being branded as "extremist" 
 
 literature there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X