వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి ప్రత్యూష కేసులో తీర్పు వాయిదా, వాదనలు పూర్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Prathyusha
హైదరాబాద్: అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన వర్ధమాన నటి ప్రత్యూష హత్య కేసులో హైకోర్టులు మంగళవారం వాదనలు పూర్తయ్యాయి. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. వర్ధమాన నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 24వ తేదీన అనుమానాస్పద స్థితిలో మరణించింది. బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ రెడ్డితో కలిసి ఆమె విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ప్రత్యూష మరణించగా, సిద్ధార్థ రెడ్డిని ఆస్పత్రిలో చేర్చారు. అయితే, ప్రత్యూష ఆత్మహత్య చేసుకోలేదని, హత్యకు గురైందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రత్యూష తల్లి సరోజినీ దేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మరణించిన సంఘటన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కుదిపేసింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలోని కొంత మందిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ప్రముఖుల పిల్లలు ఆమె మృతికి కారణమంటూ వివాదం చెలరేగింది. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన ప్రత్యూష కొన్ని సినిమాల్లో నటించింది. సినిమాల్లో అవకాశాలు పెరుగుతున్న సమయంలో ఆమె మరణించింది. ప్రత్యూష హత్య కేసులో అప్పట్లో సిద్ధార్థ రెడ్డిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు.

English summary
High Court reserved its judgement on Telugu actress Prathyusha, hearing is completed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X