హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు, ముంబైవాసి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో డ్రగ్ రాకెట్‌ గుట్టు రట్టు చేశారు. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిని వారు పట్టుకున్నారు. అతని నుంచి 40 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన జావెద్ అనే వ్యక్తి కొకైన్‌ను సరఫరా చేయడానికి తీసుకుని వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలకు, పబ్‌లకు అతను డ్రగ్స్ సరఫరా చేస్తుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తమకు అందిన సమాచారం మేరకు నిఘా వేసి పోలీసులు జావెద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

జావెద్ ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులకు, ఇతర ప్రముఖులకు హైదరాబాదులో పెద్ద యెత్తున డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొద్ది రోజులుగా హైదరాబాదు పోలీసులు డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కొంత మంది సినీ ప్రముఖులు కూడా వారి చేతికి చిక్కారు.

English summary
Another drug rocket was busted by Hydertabad Taskforce police and arrested a Nunbai resident Javed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X