వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడి మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Medak District Map
సంగారెడ్డి: మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించాడు. ప్రతీక్ రెడ్డితో పాటు సుచిత్ రెడ్డి, చంద్రారెడ్డి అనే యువకులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అరవరెడ్డి అనే యువకుడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎదురుగా వస్తున్న గొర్రెలను తప్పించబోయి ప్రతీక్ రెడ్డి కారు డివైడర్‌కు ఢీకొట్టింది. కారు నుజ్జు నుజ్జు అయింది. హైదరాబాద్ నుంచి పటాన్‌చెరులోని ఓ మిత్రుడి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం.

హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని సర్వీసు రోడ్డులో ఈ ప్రమాదం సంభవించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానిది నల్లగొండ జిల్లా. కుటుంబ సభ్యులంతా హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో ఉంటున్నారు. ప్రతీక్ రెడ్డి సిబిఐటిలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జూబ్లీహిల్స్‌లోని ఇంటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి బయలుదేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఉదయమే ఢిల్లీకి వెళ్లారు. సమాచారం తెలిసిన వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ నుంచి బయలుదేరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. నల్లగొండలోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి కాంగ్రెసు కార్యకర్తలు, ఇతరులు హైదరాబాదు బయలుదేరారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసి, నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

English summary
In a road accident in Medak district former minister Komatireddy Venkat Reddy's son Pratheek Reddy dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X