వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈటీవీకి తొలగిన అడ్డంకులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలతో ఛత్తీస్‌గఢ్‌లో ఈటీవీ ప్రసారాలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈటీవీ ప్రసారాలకు కల్పించిన అడ్డంకులను తొలగించాలని సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. భావప్రకటనా స్వేచ్ఛ పవిత్రతను కాపాడాలని సుప్రీంకోర్టు ఈటీవీకి సూచించింది. మీడియా ఆపరేషన్స్‌కు అవసరమైన పరిధిలో వ్యక్తీకరణ ఉండాలని సూచించింది. ముఖ్యమంత్రి బంధువులకు మైనింగ్ లీజులు కట్టబెట్టారనే వార్తను ప్రసారం చేసినందుకు ఈటీవీ ప్రసారాలకు అడ్డంకులు కల్పించారని ఈటీవీ తరఫు న్యాయవాది ఎఎం సింఘ్వీ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈటీవీ ప్రసారాలను అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్ మేరకు భావప్రకటనా స్వేచ్ఛ కింద అభిప్రాయాలను వ్యక్తం చేసే విషయంలో కూడా కొన్ని పరిమితులుంటాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఈటీవీ ప్రసారాలకు ఆటంకం కల్పించిన ముఖ్యమంత్రి, అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

English summary
The Supreme Court has ordered the Raman Singh government to remove impediments from broadcasting of ETV in Chhattisgarh and hoped that the TV channel would maintain the sanctity of freedom of speech and expression, which was intrinsic to media operations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X