వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిచ్చొళ్లుంటారని తెలిసింది:గీత అంశంపై రష్యా రాయబారి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhagavad Gita
న్యూఢిల్లీ/మాస్కో: హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను నిషేధించాలని కోరటాన్ని భారతదేశంలోని రష్యా రాయబారి కార్యాలయం, రష్యన్ అంబుడ్స్‌మన్ ఖండించింది. ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఎస్సీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద రచించిన భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అనే పుస్తకం విశ్వవ్యాప్తంగా గౌరవనీయమైనదని, అందువల్ల దాన్ని నిషిధించాలనటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని రష్యన్ అంబుడ్స్‌మన్ వ్లాదిమర్ లుకిన్ ఓ ప్రకటనలో తెలిపారు. గీత వివాదాస్పదం కావడం విచారకరమని రష్యం ప్రభుత్వం సోమవారం రాత్రి పేర్కొంది. పవిత్ర గ్రంథాన్ని కోర్టుకు లాగడం సరికాదని, ఇలాంటి సంఘటనలు సైబీరియాలోని అందమైన నగరం టోమ్‌స్క్‌లో జరగడం విస్మయకరమని, లౌకికవాదానికి, పరమత సహనానికి ప్రసిద్ధి గాంచిన ఈ నగరంలో ఇలాంటివి చోటు చేసుకోవడం విచారకరమని, దీన్ని బట్టి ఇలాంటి అందమైన నగరంలో కూడా పిచ్చివాళ్లు ఉంటారని స్పష్టమవుతోందని, ఇది ఎంతో బాధాకరమని భారత్‌లో రష్యా రాయబారి అలెగ్జాండర్ ఎం కదాకిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా భగవద్గీత నిషేధంపై పెనుదుమారం చెలరేగడంతో రష్యన్ కోర్టు తన తీర్పును ఈ నెల 28వ తేదికి వాయిదా వేసింది. ఈ విషయంలో రష్యన్ అంబుడ్స్‌మెన్, మాస్కోకు చెందిన నిపుణులు, సెయింట్ పీటర్స్‌బర్గ్ నుంచి అభిప్రాయాలు తీసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలని ఇస్కాన్ రష్యా విభాగం కోరడంతో కేసును వాయిదా వేసింది. నిషేధంపై తీవ్ర ప్రకంపనలు చెలరేగుతున్న దృష్ట్యా ఈ కేసును పిటిషన్‌దారు ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై సోమవారం పార్లమెంటు అట్టుడికిన విషయం తెలిసిందే.

English summary
Russia Indian Ambassador and Russian ombudsman condemned case against bhagavad gita.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X