వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విస్తృత ఏకాభిప్రాయం కావాలి: తెలంగాణపై జితేంద్ర సింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jitendra Singh
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌లో విస్తృత ఏకాభిప్రాయం అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. రాజ్యసభకు బుధవారం ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆయన ఈ విషయం చెప్పారు. సంబంధిత అశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఈ దశలో నిర్దిష్టమైన కాలపరిమితిని చెప్పలేమని ఆయన అన్నారు.

ఏ కొత్త రాష్ట్ర ఏర్పాటు అయినా విస్తృత ప్రబావాలు చూపుతాయని, దేశ ఫెడరల్ వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. మాతృ రాష్ట్రం నుంచి విస్తృత ఏకాభిప్రాయం వస్తేనే అటువంటి విషయాలపై కేంద్రం ముందుకు కదులుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పలు అంశాలను, పద్ధతులను సమీక్షించడానికి వేసిన శ్రీకృష్ణ కమిటీ గత డిసెంబర్‌లో నివేదిక సమర్పించిందని ఆయన చెప్పారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల విభజనకు తన 500 పేజీల నివేదికలో కమిటీ పలు ప్రత్యామ్నాయాలను సూచించిందని ఆయన చెప్పారు.

English summary
A broad consensus in Andhra Pradesh will be needed before a final decision on a separate state of Telangana is taken, the Rajya Sabha was informed on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X