హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి తిరుగుబాటు, ప్రజారాజ్యం పునరుద్ధరణ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరిస్తారా అనే అనుమానాలు ఒక్కసారిగా ముందుకు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ నెల్లూరు జిల్లా శానససభ్యుడు శ్రీధర్ కృష్ణారెడ్డి కొత్త వాదనను తెర మీదికి తెచ్చారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమని, పార్టీ పునరుద్ధరణ కూడా జరగవచ్చునని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రజారాజ్యం పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా నాయకురాలు తుపాకుల మునెమ్మ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడంపై, ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చేసిన విమర్శలపై ఆయన ప్రతిస్పందించారు. చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కాంగ్రెసు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో శ్రీధర్ కృష్ణా రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది.

డబ్బులకు అమ్ముడుపోవాల్సిన అవసరం చిరంజీవికి లేదని ఆయన అన్నారు. చిరంజీవిని విమర్శించే హక్కు అంబటి రాంబాబుకు లేదని ఆయన అన్నారు. ఎస్టీకి చెందిన తుపాకుల మునెమ్మకు చిరంజీవి మాటకు కట్టుబడి పార్టీ టికెట్ ఇచ్చారని, ఆమెకు కోవూరు నియోజకవర్గంలో 24 వేల ఓట్లు వచ్చాయని, చిరంజీవిని చూసి ఓటు వేయడం వల్లనే ఆమెకు అన్ని ఓట్లు వచ్చాయని ఆయన అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన అంబటి రాంబాబు వంటి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చిరంజీవిని విమర్శించడానికి తగినవారు కాదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇస్తామని చెప్పారని, పదవి కోసమైతే ఆ రోజే చిరంజీవి కాంగ్రెసులోకి వెళ్లిపోయేవారని ఆయన అన్నారు.

English summary
Prajarajyam MLA Sridhar Krishna Reddy statement about revival of party created sensation political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X