వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజమ్‌ను ఓడించేందుకే జయప్రద: అమర్ సింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jaya Prada
లక్నో: మాజీ సినీ హీరోయిన్, రాష్ట్రీయ లోక్‌మంచ్ నేత జయప్రద వచ్చే ఉత్తర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ అభ్యర్థి అజమ్ ఖాన్‌పై పోటీ చేయనున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు అమర్ సింగ్ శుక్రవారం రాంపూర్‌‍కు ఎనబై కిలోమీటర్ల దూరంలో ఉన్న సంభల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో స్పష్టం చేశారు. అజమ్ ఖాన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా అతనిని ఓడించడానికి జయప్రద అక్కడి నుండి రంగంలోకి దిగుతుందని చెప్పారు.

జయప్రదకు, అజమ్ ఖాన్‌కు కొంతకాలంగా వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో అతను ఎక్కడి నుండి పోటీ చేస్తే అక్కడి నుండి జయప్రదను రంగంలోకి దింపి అతనిని అసెంబ్లీలోకి ప్రవేశించకుండా చేయాలని అమర్ భావిస్తున్నారు. ఇందుకోసం లోక్‌మంచ్ పార్టీ నేతలు బిజెపిని కన్విన్స్ చేస్తున్నారు. అజమ్ ఖాన్ పోటీ చేసే స్థానం నుండి తాము జయప్రదను నిలబెడతామని అక్కడ మీరు పోటీకి పెట్టవద్దని తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. కాగా అజమ్ ఖాన్ ఈసారి తన రాంపూర్ నియోజవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు.

ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మోరదాబాద్ దేహత్ నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ స్థానం నుండి గతంలో పోటీ చేసి గెలుపొందిన శాసనసభ్యుడు ఓ హత్య కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో అక్కడ అజమ్ ఖాన్‌కు లైన్ క్లియర్ అయింది. కాగా ఎన్నో ఏళ్ల నుండి సమాజ్ వాది పార్టీ కీలక ముస్లిం నేతగా ఉన్న అజమ్ కొన్ని భేదాభిప్రాయల వల్ల గత లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీని వీడారు. ఆ తర్వాత 2010లో తిరిగి వచ్చారు.

English summary
The much-needed colour in the upcoming Uttar Pradesh Assembly elections, this time, will come from an unexpected corner when MP Jaya Prada takes on her arch rival Mohd Azam Khan, a senior Samajwadi Party leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X