వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ స్థాయిలో వైయస్ ఫార్ములా, మైనారిటీలకు కోటా

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఫార్ములాను జాతీయ స్థాయిలో కేంద్రం అమలు చేస్తోంది. ఒబిసిలకు కల్పించిన 27 శాతం రిజర్వేషన్లలో ముస్లిం మైనారిటీలకు 4.5 శాతం సబ్ కోటాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు ఈ రిజర్వేషన్లు అమలవుతాయి. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో ముస్లిం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నారు.

1992 జాతీయ మైనారిటీల చట్టం జాతీయ కమిషన్ సెక్షన్ 2 (సి)లో నిర్వచించిన ప్రకారం మైనారిటీలకు ఆ రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఈ సెక్షన్ కింద ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శీలు వస్తారు. మత, భాషా మైనారిటీల జాతీయ కమిషన్ సూచన మేరకు మైనారిటీలకు ఈ రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై మంత్రి వర్గం ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి తృణమూల్ కాంగ్రెసుకు చెందిన రైల్వే మంత్రి దినేష్ త్రివేది హాజరు కాలేదు.

English summary
The government on Thursday decided to carve out a sub-quota of 4.5 per cent for minorities within the 27 per cent reservation for OBCs, a move which comes ahead of the Uttar Pradesh Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X