వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెబ్‌సైట్లకు ఢిల్లీ కోర్టు దెబ్బ: కంటెంట్ తీసేయాలని ఆదేశాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Social Networking
న్యూఢిల్లీ: అభ్యంతరకరమైన విషయాలను వచ్చే వచ్చే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీలోగా తొలగించాలని ఢిల్లీ కోర్టు 21 వెబ్‌సైట్లను ఆదేశించింది. ఆ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహూ, యూట్యూబ్ ఉన్నాయి. అభ్యంతరకరమైన వెబ్‌కాస్టింగ్ ఆరోపణలపై కోర్టు ఆ సైట్లకు సమన్లు జారీ చేసింది. ఓ ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదుపై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సుదేష్ కుమార్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని, జనవరి 3వ తేదీలోగా నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఫిబ్రవరి 6వ తేదీలోగా అభ్యంతరకరమైన విషయాలను తొలగించకపోతే ఆ వైబ్‌సైట్లు కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈర్ష్యాద్వేషాలను రెచ్చగొట్టే, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే మత వ్యతిరేక, సామాజిక వ్యతిరేక విషయాలను ప్రసారం చేయకూడదని కోర్టు ఆదేశించింది. అసభ్యకరమైన, అశ్లీలమైన విషయాలను వెబ్‌సైట్లు ప్రతి ఒక్కరికీ, 18 ఏళ్ల వయస్సు దాటనివారికి కూడా అందుబాటులో ఉంచుతున్నారని ఆరోపిస్తూ కోర్టుకు ఫిర్యాదు అందింది.

English summary
In yet another blow to 21 social networking sites including Facebook, Microsoft, Google, Yahoo and Youtube, a Delhi court has asked the 21 websites to remove all derogatory content by February 6, 2012.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X