కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్న టిటిడిపి రెబెల్ జనార్ధన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Boda Janardhan
కడప: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రెబల్ నేత బోడ జనార్ధన్ ఆదివారం కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నూటా యాభై మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆయన పులివెందులలోని క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. అక్కడ జగన్ ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనార్ధన్ పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసులో చేరడంతో అదిలాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కొంత నష్టమనే చెప్పవచ్చు. ఈ సందర్భంగా జగన్ జనార్ధన్ వెంట వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని, తెలంగాణలోని జిల్లాల్లో గ్రామగ్రామాన పార్టీని పటిష్టం చేసేందుకు పాటుపడాలని కోరారు.

ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ దివంగత వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు జగన్‌తోనే సాధ్యమన్నారు. దేశంలోనే అత్యంత ప్రజాధరణ గల నేత జగన్ అని అన్నారు. మాట ఇచ్చి, మడమ తిప్పని నాయకునిగా వైయస్ జగన్ రైతుల పక్షాన ఎనలేని పోరాటం చేస్తున్నారన్నారు. ఓదార్పు యాత్రతో గ్రామాల్లో కలియ తిరుగుతూ అనునిత్యం ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

English summary
Telangana TDP rebel leader Boda Janardhan joined in YSR Congress Party on sunday in the presence of party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X