హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజగోపాల్‌కు హైకోర్టు షాక్, గాలి కేసులో బెయిల్ రద్దు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajagopal
హైదరాబాద్: గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాల కేసులో ఐఎఎస్ అధికారి రాజగోపాల్‌కు సోమవారం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సిబిఐ కోర్టు రాజగోపాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో రాజగోపాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజగోపాల్‌కు సిబిఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నందున రాజగోపాల్‌కు బెయిల్ ఇవ్వరాదని సిబిఐ వాదించింది. అంతేకాకుండా బెయిల్ ఇస్తే రాజగోపాల్ సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం కూడా ఉందని సిబిఐ అన్నది.

ఒఎంసి కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ స్థితిలో రాజగోపాల్‌కు బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి మేలు చేకూర్చే విధంగా రాజగోపాల్ వ్యవహరించారని సిబిఐ విమర్శించింది. నాంపల్లి కోర్టు రాజగోపాల్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

English summary
High Court has canceled IAS officer Rajagopal's bail, sanctioned by CBI special court earlier.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X