నాకు విప్ అందలేదు, జిరాక్స్ నోటీస్: జగన్ ఎమ్మెల్యే
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: తనకు కాంగ్రెసు పార్టీ జారీ చేసిన విప్ అందలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి మంగళవారం అన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కాపు అసెంబ్లీ కార్యదర్శి సదారాంను కలిశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తనకు కాంగ్రెసు విప్ అందలేదని, అనర్హత పిటిషన్ కూడా తనకు జిరాక్స్ కాపీ అందిందన్నారు. ఒరిజినల్ కాపీ ఇవ్వమని కార్యదర్శిని కోరానని కానీ అతను ఇవ్వలేదన్నారు.
స్పీకర్ వచ్చాక మరోసారి కలిసి అడుగుతానని చెప్పారు. నోటీసులపై తాను ఎలాంటి వివరణ ఇవ్వలేదన్నారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడం వల్ల మరోసారి కలుస్తానని చెప్పారు. నోటీసులపై ఏం చేయాలన్నది తాను ఇంకా తేల్చుకోలేదని చెప్పారు. కాగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.