వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల కోసం తొలిసారి ఉప ఎన్నికలు: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jaganmohan Reddy
కడప: దేశంలో తొలిసారి రైతుల కోసం రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగనున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్న ఆయన మంగళవారం మల్లూరు గ్రామంలో వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రసంగించారు. పదవులు పోతాయని తెలిసి కూడా తన వర్గానికి చెందిన 17 మంది శానససభ్యులు రైతుల కోసం నిలబడ్డారని ఆయన అన్నారు. మరణించిన రాజకీయ వ్యవస్థను మార్చడానికి 17 మంది శానససభ్యులు విలువలు, విశ్వసనీయతకు కట్టుబడ్డారని ఆయన ప్రశంసించారు. త్వరలో జరిగే ఉప ఎన్నికలు రైతులకు, కుళ్లిన రాజకీయ వ్యవస్థకు మధ్య జరుగుతున్న పోరాటమని ఆయన అన్నారు.

రాయచోటి నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. చిత్తూరు ఎమ్మెల్సీలు తిప్పారెడ్డి, నారాయణ రెడ్డి, తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రమీలమ్మ మల్లూరులో జగన్‌ను కలిశారు. అంతకు ముందు జగన్ వండాది గ్రామంలో వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతుల కోసం, రైతు కూలీల కోసం ఎంతవరకైనా పోరాడుతానని ఆయన చెప్పారు. కడప జిల్లాలో ఆయన ఓదార్పు యాత్ర మంగళవారంనాడు రెండో రోజుకు చేరుకుంది.

English summary
YSR Congress president YS Jagan said that his MLAs stood for farmers and prepared to face bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X