సుష్మా స్వరాజ్‌ను తిప్పి కొట్టిన మంత్రి కపిల్ సిబాల్
National
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లుపై ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ మంగళవారం లోకసభలో చేసిన విమర్సలను మంత్రి కపిల్ సిబాల్ తిప్పికొట్టారు. లోక్‌పాల్ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. సుష్మా స్వరాజ్ చేసిన విమర్శలను తప్పు పట్టారు. లోక్‌పాల్ బిల్లు రావడం బిజెపికి ఇష్టం లేదని ఆయన అన్నారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందకపోతే ప్రజలు ప్రతిపక్షాన్ని సహించబోరని ఆయన అన్నారు. ఈ బిల్లు ఆమోదం ప్రతిపక్షంపైనే ఆధారపడి ఉందని ఆయన అన్నారు. తన ప్రసంగాన్ని సుష్మా స్వరాజ్ అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో మేడమ్, మేడమ్, మేడమ్ అని వెంటవెంటనే అంటూ తన ప్రసంగాన్ని సాగించారు.
బిల్లు తెచ్చే అధికారం పార్లమెంటుకు ఉందని ఆయన చెప్పారు. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లును తేవడం బిజెపికి ఇష్టం లేదని ఆయన అన్నారు. లోక్‌పాల్ బిల్లుపై కన్నా రాజకీయ ప్రయోజనాల మీదనే బిజెపికి ఎక్కువ ఆసక్తి ఉందని ఆయన అన్నారు. మన ఇంటిలోని అవినీతిని కప్పిపుచ్చుకుని ఇతరులపై ఆరోపణలు చేయాలనే పద్ధతి ప్రతిపక్షంలో కనిపిస్తోందని ఆయన అన్నారు. బిజెపి స్వయంప్రతిపత్తి గురించి మాట్లాడుతోందని, అయితే గుజరాత్‌లో మాత్రం లోక్‌పాల్‌ను గత తొమ్మిదేళ్లుగా తేవడం లేదని ఆయన అన్నారు.
In Parliament, Congress leader Kapil Sibal spoke on behalf of the Congress, responding to Sushma Swaraj's charges over the Lokpall bill introduced by the government.
Story first published: Tuesday, December 27, 2011, 14:58 [IST]