• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అవినీతిని అంతం చేస్తుంది: లోక్‌పాల్ బిల్లుపై ప్రధాని

By Pratap
|

Manmohan Singh
న్యూఢిల్లీ: తాము ప్రతిపాదించిన లోక్‌పాల్ బిల్లు సమాజంలో అవినీతిని అంతం చేస్తుందని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. బిల్లు బలహీనంగా ఉందని, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఆయన ఖండించారు. లోక్‌పాల్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మంగళవారం సాయంత్రం లోకసభలో మాట్లాడారు. తాము ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగానే బిల్లు ఉందని ఆయన చెప్పారు. లోక్‌పాల్ బిల్లుపై తుది నిర్ణయం తీసుకునే హక్కు తమకు ఉందని ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు లోక్‌పాల్ బిల్లు ఆమోదానికి సహకరించడానికి ముందుకు రావాలని ఆయన సూచించారు. జాతీయ ప్రయోజనాలకు ప్రథమ స్థానం ఇచ్చి ఆలోచన చేయాలని ఆయన సూచించారు. అశించిన స్థాయిలోనే బిల్లు ఉందని ఆయన చెప్పారు.

అవినీతిని అంతమొందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవాలని ఆయన అన్నారు. నిత్యావసర సేవల్లో అవినీతి లేకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం దేశం యావత్తూ చూస్తోందని ఆయన అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వం పోరాడుతోందని ఆయన చెప్పారు. సిబిఐకి స్వయం ప్రతిపత్తి ఉండాలని, లోక్‌పాల్ పరిధిలోకి సిబిఐని తేవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. సిటిజన్స్ చార్టర్, న్యాయ వ్యవస్థలకు సంబంధించిన జవాబుదారీ తనం వల్ల అవినీతిని నియంత్రించడానికి వీలవుతుందని ఆయన అన్నారు.

English summary
Rejecting Opposition charge that the Lokpal Bill drafted by the government is weak and unconstitutional, Prime Minister Manmohan Singh on Tuesday assured that the anti-graft legislation will surely weed out corruption from our society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X