వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల్లోకి మంత్రి గల్లా అరుణకుమారి తనయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Galla Aruna Kumari
చిత్తూరు: మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు, అమర రాజా బ్యాటరీస్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రెండు వేల కోట్ల టర్నోవర్ గల అమరరాజా బ్యాటరీస్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న గల్లా జయదేవ్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు దశాబ్దాల క్రితం రాజకీయ శాస్త్రంలో అమెరికాలో ఎంఎస్ చేసి జయదేవ్ తిరిగి వచ్చారు. వ్యాపారంలో తన తండ్రి రామచంద్ర నాయుడికి చేదోడువాదోడుగా ఉండేందుకు ఇక్కడికి వచ్చారు. వెనకబడిన చిత్తూరు జిల్లాలో రామచంద్ర నాయుడు అమర రాజా గ్రూప్‌ను స్థాపించిన తొలి తరం పారిశ్రామికవేత్త.

ఆంధ్రప్రదేశ్ సిఐఐ చైర్మన్‌గా కూడా ఉన్న గల్లా జయదేవ్ కుటుంబానికి రాజకీయాలతో అవినాభావ సంబంధం ఉంది. జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారి ప్రస్తుతం గనుల మంత్రిగా ఉన్నారు. మూడు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. జయదేవ్ తాత పాతూరి రాజగోపాల నాయుడు చిత్తూరు నుంచి రెండు సార్లు పార్లమెంటు ఎన్నికయ్యారు. తొలుత స్వతంత్ర పార్టీలో ఉన్న ఆయన తర్వాత కాంగ్రెసులోకి వచ్చారు. జయదేవ్ గల్లా కుటుంబానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆయన కాంగ్రెసులో చేరే అవకాశం ఉంది. చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేస్తే ఖాళీ అయ్యే తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి గల్లా జయ్ పోటీ చేసే అవకాశం ఉంది.

English summary
Jaydev Galla, Managing Director of the Rs 2000-crore turnover Amara Raja Batteries, has decided to take the plunge into politics. He will power up the Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X