వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగు బయటపడింది: బిజెపిపై సోనియా తీవ్రవిమర్శలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 127వ కాంగ్రెసు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె న్యూఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. లోక్‌పాల్ బిల్లుపై బిజెపి అసలు రంగు నిన్న బయటపడిందని ఆమె ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. వారు లోక్‌పాల్ బిల్లును ఎంతగా వ్యతిరేకించినప్పటికీ తాము బలమైన బిల్లు ప్రవేశ పెట్టామన్నారు. బిల్లు ఆమోదం పొందడం సంతోషకరమన్నారు.

కాగా హైదరాబాదులోని గాంధీ భవనంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి మాజీ సారథి డి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

English summary
We wanted to strengthen the Lokpal Bill but the BJP did not want it said, Sonia Gandhi today in 127th inauguration day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X