వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగవద్గీత బ్యాన్‌ పిటిషన్ డిస్మిస్, గెలిచిన రష్యా హిందువులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhagavad Gita
మాస్కో: భగవద్గీతపై నిషేధం విధించాలని కోరుతూ సైబేరియా కోర్టులో వేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసిన రష్యాలోని హిందువులు విజయం సాధించారు. ఉగ్రవాద సాహిత్యంగా ముద్ర వేసి భగవద్గీతను నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను సైబేరియా కోర్టు బుధవారం తోసిపుచ్చింది. సైబేరియాలోని టోమ్‌స్క్ కోర్టు దానిపై బుధవారం తుది విచారణ చేపట్టింది. స్టేట్ ప్రాసిక్యూటర్ వాదనలను, హిందువుల ప్రతిస్పందనను విన్న జడ్జి పిటిషన్‌ను సమీక్షించి, భగవద్దీతను నిషేధించాలనే విజ్ఞప్తిని తోసిుపుచ్చారు.

స్టేట్ ప్రాసిక్యూటర్స్ కేసును కోర్టు డిస్మిస్ చేసిందని ఇస్కోన్ రష్యా యూనిట్ నాయకుడు సాధు ప్రియ దాస్ చెప్పారు. జూన్ నుంచి కేసు టోమ్స్‌క్ కోర్టులో నడుస్తోంది. నిషేధం విధించకుండా రష్యాతో దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని రష్యాలోని హిందువులు భారత ప్రభుత్వాన్ని కోరారు. భారత ప్రభుత్వం, మాస్కోలోని భారత దౌత్య కార్యాలయం విషయాన్ని రష్యా ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ మంగళవారం భారతదేశంలోని రష్యా దౌత్యవేత్త అలెగ్జాండర్ కడకిన్‌తో సమావేశమయ్యారు.

English summary
Hindus in Russia Wednesday won a hard-fought six-month battle in a Siberian court against a plea to ban the Bhagavad Gita, among their holiest of religious scriptures, with the judge dismissing the state prosecutors' stand the book be branded "extremist" literature
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X