• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చిరు ఇక్కడే ఉండాలి: రామచంద్రయ్యకు వద్దు: వీరశివా

By Srinivas
|

veera siva reddy
హైదరాబాద్: చిరంజీవి వర్గం నేత సి.రామచంద్రయ్యకు మంత్రి పదవిని తాము వ్యతిరేకిస్తామని కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు వీర శివా రెడ్డి శుక్రవారం అన్నారు. మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అధిష్టానం నిర్ణయం ప్రకారం జరుగుతుందన్నారు. కాంగ్రెసులో విలీనం చేసిన కారణంగా ప్రజారాజ్యం పార్టీ నేతలకు మంత్రి పదవులు ఇవ్వాల్సిందేనని చెప్పారు. అయితే సి.రామచంద్రయ్యకు ఇస్తే మాత్రం వ్యతిరేకిస్తామని చెప్పారు. కాంగ్రెసు నేతలు చిరంజీవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు.

ఎమ్మెల్సీలకు పదవి ఇవ్వాల్సి వస్తే సి.రామచంద్రయ్య కంటే కాంగ్రెసులో ఎందరో సీనియర్లు ఉన్నారన్నారు. రామచంద్రయ్యకు పదవి ఇస్తే జిల్లాలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఆయన కనీసం కార్పోరేటర్‌ను కూడా గెలిపించుకోలేరన్నారు. చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తామంతా చిరంజీవికి మంచి అభిమానులమన్నారు. పిఆర్పీ ఎమ్మెల్యేలకు అధిష్టానం త్వరలో మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయిస్తారని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. సిఎం ఇష్ట ప్రకారమే కెబినెట్ విస్తరణ ఉంటుందన్నారు.

English summary
Congress MLA Veera Siva Reddy said 
 
 today that Chiranjeevi is suitable 
 
 for state politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X