వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం దుకాణాలపై బొత్స ఎలా చెప్పగలిగారు?: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

chiranjeevi
హైదరాబాద్: మద్యం పాలసీ ప్రకారం ఒక వ్యక్తికి ఒకే దుకాణం ఉండాలని, కానీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తనకు 31 మద్యం షాపుల్లో వాటాలున్నాయని ఎలా చెప్పగలిగారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎన్టీఆర్ భవవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. ఇటీవల జరిగిన దాడుల్లో బయటపడిన ఎసిబి రికార్డులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మద్యపానం విషయంలో హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కిరణ్ ప్రభుత్వానికి సూచించారు. టిడిపి హయాంలో మద్యపానాన్ని నియంత్రిస్తే ఇప్పుడు వారు దేశంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకు వచ్చారని ఆరోపించారు. మద్యం విషయంలో సాక్ష్యాత్తూ యువజన కాంగ్రెసు నాయకుడే లేఖ రాశారన్నారు. మద్యం విషయంలో ప్రభుత్వం చర్యలకు నిరసనగా జనవరి 3, 4, 5 తేదీల్లో నియోజకవర్గాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.

లోక్‌పాల్ విషయంలో కాంగ్రెసు పార్టీ రాజ్యసభలో దాదాపు పారిపోయినంద పని చేసిందని బాబు ఎద్దేవా చేశారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య అవినీతిని రూపుమాపడంలో కాంగ్రెసుకు చిత్తశుద్ధి లేదన్నారు. లోక్‌పాల్‌ను కేంద్రం నీరుగార్చి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసిందన్నారు. లోక్‌పాల్ విషయంలో కేంద్రానికి తాను కూడా లేఖ రాశానన్నారు. ఉగ్రవాదం కంటే అవినీతే ప్రమాదమైందన్నారు. ఎంపీలను కొనుగోలు చేసి మరీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే కాంగ్రెసు ప్రజల పట్ల బాధ్యతను మరిచి పోతుందన్నారు. సమర్థ లోక్‌పాల్ కోసం టిడిపి పోరాడం చేస్తుందన్నారు. అవినీతి విషయంలో కేంద్రం బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

English summary
TDP chief Nara Chandrababu Naidu questioned that how pcc chief Botsa told about his liquor shops. He said that, by iquor policies one person - one shop only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X