వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభలో అర్థరాత్రి దాకా డ్రామా: లోక్‌పాల్ గోవిందా

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: మంగళవారం లోక్‌సభలో మూజువాణి ఓటుతో గట్టెక్కిన లోక్‌పాల్ బిల్లు గురువారం రాజ్యసభలో గల్లంతైంది. పెద్దల సభలో దీనిని గట్టెక్కించేందుకు యూపీఏకు తగిన బలం లేకపోవడంతో కాంగ్రెస్‌లోఉత్కంఠ నెలకొంది. మిత్రపక్షమైన తృణమూల్ కూడా బిల్లును వ్యతిరేకిస్తుండటంతో ఉత్కంఠ మరింత పెరిగింది. దానికి తోడు, వివిధ పక్షాలు ఏకంగా 187 సవరణలు ప్రతిపాదించడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. బయటి నుంచి మద్దతిచ్చే బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీలు సహకరిస్తే మినహాసబిల్లు గట్టెక్కే అవకాశమే లేదు. దీంతో బల సమీకరణ కోసం కాంగ్రెస్ భారీ కసరత్తు చేసింది. దీనిపై ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీలో సభ్యులు కానప్పటికీ మంత్రులు కపిల్ సిబల్, పవన్ కుమార్ బన్సల్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.

కోర్ కమిటీ భేటీ తర్వాత ప్రణబ్, బన్సల్, కపిల్ సిబల్ ఆర్జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్, బీఎస్పీ నాయకుడు సతీశ్ చంద్ర మిశ్రాలతో సమావేశమయ్యారు. కానీ ఆ నేతలు తమ వైఖరి మార్చుకోలేదు. తృణమూల్ నేతలూ దిగి రాలేదు. బిల్లు విషయంలో విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రభుత్వానికి మాత్రం మిత్రపక్షాలు సహకరించలేదు. ఓటింగ్ జరిగితే ప్రభుత్వానికి పరాభావం తప్పదని ఖాయంగా తేలిపోయింది. దీంతో ఓటింగ్ దాకా రాకుండానే గందరగోళానికి తెర తీసి, బిల్లును పక్కన పెట్టేశారు.

'లోక్‌పాల్, లోకాయుక్త బిల్లు -2011'ను మంత్రి నారాయణస్వామి గురువారం ఉదయం ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ప్రధాని మన్మోహన్ సభలో లేకపోవడంతో విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. 'ప్రధాని వచ్చేస్తున్నారు. ఆయన దారిలో ఉన్నారు' అని అధ్యక్షుడు హమీద్ అన్సారీ ప్రకటించినా వినిపించుకోలేదు. దీంతో సభను పది నిమిషాలు వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రధాని వచ్చిన తర్వాతే విపక్ష నేత అరుణ్ జైట్లీ బిల్లుపై చర్చ ప్రారంభించారు. ఆయన వాదనలను కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ తిప్పికొట్టారు. రాత్రి 11.30 గంటల సమయానికిగానీ వీరికి రాజ్యాంగ నిబంధనలు గుర్తుకు రాలేదు. అప్పుడు... అర్ధరాత్రి 12 గంటల తర్వాత చర్చ కొనసాగించడంపై హైడ్రామా మొదలైంది. మంత్రి నారాయణస్వామి మాట్లాడుతుండగా పరిస్థితి అదుపు తప్పుతున్న సంకేతాలు కనిపించాయి. అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత సభను హమీద్ అన్సారీ వాయిదా వేశారు.

English summary
Faced with a certain defeat in the Rajya Sabha over the Lokpal Bill, the government on Thursday ducked the vote, leaving the fate of the landmark anti-corruption legislation in limbo and prompting many parties to term it a sad day for India's parliamentary democracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X